10 కిలో మీటర్లు.. 40 మూల మలుపులు
PDPL: పాలకుర్తి, కమాన్ పూర్ రెండు మండలాలను కలిపే సింగిల్ తారు రోడ్డు మూల మలుపులతో ప్రమాదకరంగా మారింది. కన్నాల రైల్వే గేటు నుంచి కమాన్ పూర్ మండలం వరకు 10 కిలో మీటర్ల పరిధిలో 40 మలుపులు ఉండడం ప్రయాణికులకు ప్రయాణం కత్తి మీద సాములా మారింది. రోడ్డుకిరువైపులా చెట్ల పొదలు రోడ్డును కమ్మేసి ఉండడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు