ప్రముఖ నటుడు కన్నుమూత
హాలీవుడ్ సీనియర్ నటుడు జేమ్స్ టోల్కన్ (94) కన్నుమూశాడు. 'బ్యాక్ టు ది ఫ్యూచర్', 'టాప్ గన్' వంటి చిత్రాలతో ఆయన ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాడు. తెరపై కఠినమైన ప్రిన్సిపాల్, కమాండర్ పాత్రల్లో మెప్పించిన ఆయన, నిజ జీవితంలో ఎంతో దయగల వ్యక్తిగా పేరుపొందాడు. న్యూయార్క్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచిన ఆయన మృతి పట్ల సినీ పరిశ్రమ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.