మధ్యాహ్న భోజనం పరిశీలించిన అధికారులు

NRPT: జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజన జిల్లా ఇంచార్జ్ యాదయ్య శెట్టి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వండిన ఆహార పదార్థాల రుచిని తనిఖీ చేశారు. విద్యార్థులకు న్యాయమైన భోజనం అందించాలని నిర్వాహకులకు సూచించారు. వంటగది, పరిసరాలను శుభ్రంగా ఉంచాలని చెప్పారు. సీఎంవో రాజేంద్ర కుమార్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.