కాలువ ఇలా.. నీరు పారెదెలా..?

JGL: మల్యాల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తా వద్ద నుంచి వెళ్లే కాలువ (ఒర్రె)లో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి వరద నీరు పారకుండా అధ్వానంగా తయారైంది. ముత్యంపేట శివారులోని భీమన్న చెరువు నుంచి మల్యాలలోని సూరప్ప చెరువులోకి ఈ కాలువ ద్వారానే వర్షపు నీరు చేరుకుంటుంది. అయితే, ఇప్పుడు వర్షాలు కురుస్తుండడంతో చెరువులు నిండే పరిస్థితి నెలకొంది.