నాయకుడిని పరామర్శించిన బీజేపీ ఇంఛార్జ్

నాయకుడిని పరామర్శించిన బీజేపీ ఇంఛార్జ్

సత్యసాయి: ధర్మవరం రూరల్ మండలం మల్కాపూరం గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి పాము కాటుకు గురై ప్రస్తుతం ఆర్‌టీడీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న నియోజకవర్గ బీజేపీ ఇంఛార్జ్ హరీష్ బాబు ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. శంకర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.