కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అదనపు ఎస్పీ

కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన అదనపు ఎస్పీ

జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీగా నియమితులైన చేతన్ నితిన్ గురువారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అదనపు ఎస్పీ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని చేతన్ నితిన్ తెలిపారు.