శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన

RR: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శంషాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే అలయన్స్ విమానంలో సాంకేతిక లోపం రావడంతో కనీసం గంట సేపు నుంచి రన్ వే పైనే విమానం నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. మూడుసార్లు రన్ వే పైకి వెళ్లి తిరిగి రావడంతో తిరుపతి వెళ్లాల్సిన 37 మంది ప్రయాణికులు ఆందోళన చేపట్టి అక్కడి సిబ్బందిని నిలదీశారు.