చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క ఆదేశాలు
MLG: వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు జిపిలు,మండల కేంద్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ డైరెక్టర్ దివ్యా దేవరాజన్ కు ఆదేశాలు జారీచేశారు. గ్రామాల్లో ప్రయాణించే వారు, పనుల నిమిత్తం బయటకు వెళ్లే ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.