'నిరుద్యోగ యువత స్కిల్స్‌పై ఫోకస్ చేయాలి'
HYD: సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్స్‌లో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ, టూల్-కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. యువత క్రియేటివిటీతో స్వయం ఉపాధిని పొందాలని పేర్కొన్నారు.