యూరియా కొరతతో రైతుల ఇక్కట్లు !

జనగామ: జిల్లాలో యూరియా కొరత ఇంకా తగ్గడం లేదు. శనివారం కొడకండ్ల మండలం గిర్నీ తండాలోని కిసాన్ అగ్రి సెంటర్ వద్ద రైతులు యూరియా కోసం క్యూ కట్టి, చెప్పులు పెట్టి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. తెల్లవారుజామున నుండి వేచి చూస్తున్న యూరియా దొరకడం లేదు అని వారు వాపోతున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు పట్టించుకుని యూరియా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.