సర్పంచ్ ఏకగ్రీవం.... మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాకిరకొమ్ముల గ్రామ పంచాయతీ సర్పంచ్‌తో సహా వార్డు మెంబర్‌లు ఏకగ్రీవం కావడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నాకిర కొమ్ముల గ్రామ సర్పంచ్ బుర్ర కళ్యాణి మహేష్ ,ఉప సర్పంచ్ శ్రీగిరి సూర్యకళ వెంకటేష్, వార్డు మెంబర్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి సత్కరించారు.