ఒంటిమిట్ట సీఐగా నరసింహారాజు

ఒంటిమిట్ట సీఐగా నరసింహారాజు

KDP: ఒంటిమిట్ట నూతన సీఐగా నరసింహారాజు ఇవాళ బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన సీఐ బాబు అన్నమయ్య జిల్లాకు బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం సీఐగా బాధ్యతలు చేపట్టిన నరసింహారాజు చిత్తూరు జిల్లా వీఆర్ నుంచి ఒంటిమిట్టకు వచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తానని, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపుతామని చెప్పారు.