తాగి నడిపితే జైలుకే.. సీపీ సాయి చైతన్య

NZB: పోలీస్ కమిషనరేటు పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో జులై నెలలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు దాదాపు 1708 నమోదు చేసినట్లు సీపీ సాయి చైతన్య గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కేసుల్లో 966 మంది నిందితులపై అభియోగాలు మోపుతూ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 77 కేసుల్లో జైలు శిక్ష విధించగా మిగతా కేసులలో జరిమానాలు విధించారని వివరించారు.