VIDEO: బురదమయంగా మారిన ఆర్టీసీ బస్టాండ్

ప్రకాశం: మార్కాపురం బస్టాండ్ సమీపంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బురదమయంగా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికులు బస్సు ఎక్కే ప్రాంతం మొత్తం బురదమయం కావడంతో బస్సు ఎక్కేందుకు నానా అవస్థలు పడుతున్నారు. త్వరలో జిల్లా కాబోతున్న తరుణంలో బస్టాండ్‌కు మరమ్మతులు చేయాలని అధికారులను ప్రయాణికులు కోరుతున్నారు.