ఎల్లుండి నుంచి 'హైదరాబాద్ బుక్ ఫెయిర్'
TG: ఒక మంచి వాక్యం ఆలోచనలను మారిస్తే.. జీవితాన్నే మార్చే శక్తి ఒక పుస్తకానికి ఉంది. అలాంటి లక్షలాది పుస్తకాలు, వందలాది మంది రచయితలు ఒక్కచోట చేరనున్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ సమీపంలోని NTR స్టేడియంలో ఈ నెల 19 నుంచి 29 వరకు 11 రోజుల పాటు 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరగనుంది. 1PM నుంచి 9PM వరకు ప్రదర్శన ఉంటుంది.