కో ఆప్షన్ సభ్యులను అభినందించిన ఎమ్మెల్యే
NTR: నూతనంగా ఎన్నికైన కొండపల్లి మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యులను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ అభినందించారు. కొండపల్లి పురపాలిక కో- ఆప్షన్ ఎన్నికను పురపాలిక కార్యాలయంలో నిర్వహించారు. ఛైర్మన్ చిట్టిబాబు, ఇంఛార్జ్ కమిషనర్ వెంకటరత్నం ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. ప్రజలకు అత్యుత్తమ సేవలను అందించాలని కో ఆప్షన్ సభ్యులకు సూచించారు.