ఎన్నికల ఏర్పాట్లపై సమావేశం

ఎన్నికల ఏర్పాట్లపై సమావేశం

VKB: కుల్కచర్ల మండలంలో MPTC, ZPTC ఓటర్ తుది జాబితాను విడుదల చేశామని MPDO సోమవారం తెలిపారు. మండలంలో 38,387 ఓటర్లు ఉన్నారని 12 MPTCలకు 63 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గ్రామాలలో పోలింగ్ బూత్ల ఏర్పాటుపై మండల పరిషత్ కార్యాలయంలో రాజకీయ నాయకులకు సమావేశం నిర్వహించారు. ఎన్నికలపై ఏమైనా సందేహాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.