ఈనెల 30న నెట్ బాల్ జిల్లా జట్టు ఎంపికలు

నిజామాబాద్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 30న ఉదయం 10 గంటలకు సారాంగపూర్ జడ్పీహెచ్ఎస్‌లో ఉమ్మడి జిల్లాల అండర్-19 బాలబాలికలకు నెట్ బాల్ ఎంపికలు ఉంటాయని డీఐ ఈవో రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు బోనాపైడ్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు నేరుగా సంప్రదించాలన్నారు.