జగ్జీవన్ రామ్‌కు పోలీసుల నివాళి
CTR: భారత మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా సాయుధ దళ కార్యాలయంలో పోలీసులు ఘనంగా నివాళులు అర్పించారు. ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు ఏఆర్ డీఎస్పీ చిన్ని కృష్ణ పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడుతూ.. సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.