పాఠశాలను సందర్శించిన అకడమిక్ మానిటరింగ్ అధికారి

పాఠశాలను సందర్శించిన అకడమిక్ మానిటరింగ్ అధికారి

SRD: చౌటకూర్ మండలం కోర్పోల్ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను అకడమిక్ మానిటరింగ్ అధికారి బాలయ్య మంగళవారం సందర్శించారు. పాఠశాలలో వార్షిక పరీక్షలు రాస్తున్నా తీరును ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు రాసిన పరీక్ష పేపర్లను మూల్యాంకనం చేసి ఫలితాలను తెలియజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.