రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి
NGKL: చారకొండ మండలం శిర్సనగండ్ల సీతారామచంద్ర స్వామిని మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి దర్శించుకున్నారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అర్చకుల వేదమంత్రాల మధ్య స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకను వీక్షించేందుకు సుమారు 20 వేల మంది భక్తులు తరలివచ్చారు.