'జగదేకవీరుడు అతిలోకసుందరి'.. శ్రీదేవి వీడియో

మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన మూవీ 'జగదేకవీరుడు అతిలోకసుందరి'. ఈ సినిమా ఈ నెల 9న రీ రిలీజ్ కానున్న సందర్భంగా చిత్ర బృందం సోషల్ మీడియాలో స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది. ఈ సినిమాపై గతంలో శ్రీదేవి పంచుకున్న విశేషాలకు సంబంధించిన వీడియోను 'వైజయంతీ మూవీస్' సంస్థ అభిమానులతో పంచుకుంది.