గుంటూరులో స్వస్థ్ నారీ- సశక్త్ పరివార్ కార్యక్రమం
GNTR: స్వస్థ్ నారీ- సశక్త్ పరివార్ కార్యక్రమం గుంటూరులో బుధవారం ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్యమైన స్త్రీ, ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది అని కేంద్ర మంత్రి తెలిపారు. అన్ని ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి స్త్రీలకు వైద్య పరీక్షలు చేస్తారని చెప్పారు.