మద్యం నిషేధం.. అమ్మితే రూ.10 వేల జరిమానా

మద్యం నిషేధం.. అమ్మితే రూ.10 వేల జరిమానా

VKB: ధారూర్ మండలం ఆవుసుపల్లి గ్రామాన్ని మద్యపాన రహిత గ్రామంగా తీర్చిదిద్దాలని గ్రామస్థులు నిర్ణయించారు. సర్పంచ్ మహేశ్ నిర్వహించిన గ్రామసభలో మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే రూ.10,000 జరిమానా విధించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో గ్రామంలో సమస్యలు తగ్గుతాయని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.