ఆసుపత్రి నియామకాల్లో మైనార్టీలకు న్యాయం కోరిన బీఎస్పీ
KRNL: ఆదోని మెన్ ఏరియా జనరల్ ఆసుపత్రిలో ఉద్యోగ నియామకాలలో ముస్లిం మైనార్టీ అభ్యర్థులకు తగిన అవకాశాలు కల్పించడం లేదని బీఎస్పీ ఆదోని అధ్యక్షుడు ఫయాజ్ బాషా షేక్ అమ్లివాలే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదోని సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అర్హతలు ఉన్న ముస్లిం యువతకు సమాన అవకాశాలు కల్పించి, నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.