ముదిగొండలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

KMM: ముదిగొండ మండల కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ సునీత ఎల్జిబెత్, పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో పశువైద్యాధికారి డా. అశోక్, PHCలో వైద్యాధికారి అంకం అరుణాదేవిలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.