యుద్ధం ఎఫెక్ట్..అరుణాచలంలో లడ్డూ కష్టాలు
పశ్చిమాసియా యుద్ధం కారణంగా తలెత్తిన గ్యాస్ కొరత తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయ ప్రసాదంపై ప్రభావం చూపింది. గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా లడ్డూల తయారీని అధికారులు నిలిపివేశారు. అయితే, భక్తుల డిమాండ్ మేరకు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలపై లడ్డూలు, మురుకులు తయారు చేయించాలని నిర్ణయించారు. ఉచిత లడ్డూ ప్రసాదం పంపిణీకి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.