VIDEO: నేరడిగొండకు చేరుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు..
ADB: నేరడిగొండ మండలంలో ప్రత్యేక మెడికల్ క్యాంప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. నాయకులు శ్రీహరి రావు, కార్యకర్తలు తదితరులున్నారు.