ప్రమాదకరంగా విద్యుత్ స్తంభం
KMM: కారేపల్లి - పేరుపల్లి మార్గంలో సొసైటీ కార్యాలయం వద్దనున్న ప్రధాన విద్యుత్ స్తంభం పూర్తిగా విరిగి ఏ క్షణమైనా కూలిపోయేలా ప్రమాదకరంగా మారిందని గ్రామస్తులు ఆదివారం వెల్లడించారు. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తక్షణమే ఆ స్తంభాన్ని మార్చాలని డిమాండ్ చేశారు.