చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

KMR: కామారెడ్డి జిల్లా రామారెడ్డికి చెందిన లింగాల బాలకృష్ణ గౌడ్(36) పటేల్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్ల ఎస్సై రాజారాం తెలిపారు. మృతుడు కల్లు దుకాణంలో పనిచేసి మధ్యాహ్నం మోటార్ సైకిల్‌పై బయటకు వెళ్ళి చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి భార్య రజిత తెలిపింది. భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.