VIDEO: రోడ్డుపై కంకర వేశారు.. బీటీ వేయడం మరిచారు

VIDEO: రోడ్డుపై కంకర వేశారు.. బీటీ వేయడం మరిచారు

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుంచి గుండి గ్రామానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. ఆ దారిలో కంకర పోశారు.. కానీ మళ్లీ రోడ్డుపై బీటీ వేయకపోవడంతో ఆ రహదారిపై వెళ్లే వాహనాల వల్ల దుమ్ముధూళి లేస్తోంది. ప్రతి రోజూ గుండి గ్రామం నుంచి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి గ్రామస్థులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు రోడ్డుకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.