మూలపేట పోర్టును సందర్శించిన మంత్రి
SKLM: మూలపేట పోర్టును సోమవారం మంత్రి అచ్చెన్నాయుడు సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్‌లోగా పోర్టు పనులను పూర్తి చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. మూలపేట పోర్టుకు రోడ్డు, రైల్ రవాణా అవసరమని పేర్కొన్నారు. కేంద్రం నుంచి 390 ఎకరాలు లీజ్‌కు తీసుకున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం భూ నిర్వాసితులను గాలికి వదిలేసిందని విమర్శించారు.