కలెక్టర్‌కు వినతిపత్రం అందించిన కార్మికులు

అన్నమయ్య: రాజంపేట మండలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద బుధవారం రాష్ట్ర ఆటో డ్రైవర్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు ధర్నా నిర్వహించారు. ఆటో డ్రైవర్‌లకు వాహన మిత్ర అమలు చేయాలని, ఫ్రీ బస్సు పథకం ద్వారా నష్టపోతున్న ఆటో కార్మికులకు ప్రభుత్వం సాయం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ భావనకు వినతి పత్రం అందజేశారు.