సింహాచలం దుర్ఘటనపై మంత్రుల కమిటీ బాధ్యత వహించాలి

VZM: సింహాచలం దుర్ఘటనపై మంత్రుల కమిటీ బాధ్యత వహించాలని విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. భీమిలిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చందనోత్సవంలో భాగంగా ముందుగానే మంత్రుల కమిటీ ఆలయంలో పర్యటించిందని.. నాలుగు రోజుల క్రితమే గోడ నిర్మాణం జరిగిందన్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలుగానే పరిగణించాలన్నారు.