ఈ నెల 15న జాబ్ మేళా
W.G: తాడేపల్లిగూడెం శ్రీ వాసవి డిగ్రీ కళాశాలలో ఈ నెల 15న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్, వికాస ట్రైనింగ్, ప్లేస్మెంట్ సర్వీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పదో తరగతి నుంచి బీటెక్ పూర్తి చేసి 35 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు.