'స్మశాన వాటిక ధ్వంసం.. వెంటనే చర్యలు తీసుకోవాలి'
RR: కొత్తపేట డివిజన్ రాక్ టౌన్ కాలనీ పెట్రోల్ బంక్ వెనక భాగంలో ఉన్న స్మశాన వాటికలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పలు సమాధులను, ప్రహరీ గోడలను కూల్చారు. దీంతో కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ వెంటనే ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. స్మశాన వాటిక ప్రాంతాన్నిధ్వంసం చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులపై తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.