జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమలు: ఎస్పీ

NRPT: జిల్లాలో మంగళవారం నుంచి సెప్టెంబర్ 30 వరకు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా ఏ రాజకీయ, కార్మిక, విద్యార్థి సంఘాలు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాలలో మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులను ప్రచారం చేయవద్దని కూడా ఆయన హెచ్చరించారు.