'లోక్ అదాలత్‌ను సద్వినియం చేసుకోండి'

ప్రకాశం: సెప్టెంబర్ 13వ తేదీన గిద్దలూరు కోర్టు ప్రాంగణంలో జరిగే లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ భరత్ చంద్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజీ పడదగ్గ కేసులు, చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ఇదే సరైన వేదిక అని న్యాయమూర్తి శుక్రవారం తెలిపారు. లోక్ అదాలత్‌లో పరిష్కరించబడ్డ కేసులకు అదే అంతిమ తీర్పు అని అన్నారు.