రేపు నమూనా నవోదయ పరీక్ష
SKLM: మందసలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఒరియా మాధ్యమం నమూనా నవోదయ పరీక్షను ఈ నెల 16వ తేదీన (ఆదివారం) నిర్వహించనున్నట్లు జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు జగదీష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పరీక్షలో పాల్గొనదలచిన వారు ముందుగా పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.