మడకశిరకు రానున్న మంచు మనోజ్ దంపతులు

సత్యసాయి: మడకశిర నియోజకవర్గంలోని హేమావతిలో ఈనెల 22న సినీ నటుడు మంచు మనోజ్ తన భార్యతో కలిసి శ్రీ సిద్దేశ్వర స్వామిని దర్శించుకోనున్నట్లు సమాచారం. స్థానికంగా జరిగే ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా స్వామి ఆలయాన్ని సందర్శించనున్న వీరి రాకకు భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.