రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

ప్రకాశం: కనిగిరి పట్టణ సమీపంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెలిగండ్ల మండలం గుమ్మల్లకర్ర గ్రామానికి చెందిన ఎక్కులూరి సుబ్బయ్య ప్రమాదంలో గాయపడ్డారు. రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు వెంటనే స్పందించి అతన్ని ఆటోలో కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.