'అంగన్‌వాడీ సహాయకురాలిపై రాజకీయ వేధింపులు ఆపాలి'

'అంగన్‌వాడీ సహాయకురాలిపై రాజకీయ వేధింపులు ఆపాలి'

VZM: గజపతినగరం మండలంలోని రామన్నపేట గ్రామంలో అంగన్‌వాడీ సహాయకురాలు మానాపురం సౌజన్యపై జరుగుతున్న రాజకీయ వేధింపులు తక్షణమే ఆపాలని ఇవాళ CITU జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ తెలిపారు. ఆమెకు ఇచ్చిన రెండు మెమోలను వెనక్కి తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కళాశాల నుంచి గాంధీజీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి తమ డిమాండ్లను తెలియజేశారు.