రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం
నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపోలో రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య తెలిపారు. డిపో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు తమ సలహాలు, సూచనలు తెలిపేందుకు రేపు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు 9959226288 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.