నేటి నుంచి టెట్ పరీక్షలు షురూ.. ఆలస్యమైతే నో ఎంట్రీ
GNTR: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్) బుధవారం నుంచి మొదలై ఈ నెల 20వ తేదీ వరకు జిల్లాలోని ఐదు కేంద్రాల్లో జరుగుతుందని డీఈవో రేణుక తెలిపారు. ఉదయం (9.30-12.00),మధ్యాహ్నం (2.30-5.00) రెండు సెషన్లలో ఈ పరీక్షలు ఉంటాయి. పరీక్ష కేంద్రానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులకు ప్రవేశం ఉండదని డీఈవో స్పష్టం చేశారు.