సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ
BDK: జూలూరుపాడు మండలానికి చెందిన జ్యోతిబసు అనే వ్యక్తి ఇటీవల సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి రూ. 3,21,000 పోగొట్టుకున్నాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ నగదును జిల్లా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు, జూలూరుపాడు పోలీస్ అధికారుల సహాయంతో మంగళవారం తిరిగి అతని ఖాతాలో జమ చేయించారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొత్తగూడెం DSP రెహమాన్ తెలిపారు.