దైవచింతనతో మానసిక ప్రశాంతత: మాజీ ఎమ్మెల్యే

NLG: ప్రతి ఒక్కరు రేణుక ఎల్లమ్మ తల్లి అనుగ్రహం పొందాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం డిండి మండలం ఖానాపురంలో శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.