సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్
జగిత్యాల: జిల్లాలోని దరూర్ క్యాంప్‌లో ఉన్న ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు, సాంకేతిక అంశాలను పరిశీలించారు. ప్రతినెలా తనిఖీలు జరుగుతున్నాయని తెలిపారు. గోదాములో ఎలాంటి లోపాలు లేకుండా పటిష్ట భద్రత ఉండాలని, అప్రమత్తంగా పర్యవేక్షించాలని సిబ్బందికి సూచించారు.