వర్క్ బుక్కులను పరిశీలించిన ఎంఈవో

SKLM: నరసన్నపేట మండలం బాలసీమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎంఈవో 2 పేడాడ దాలి నాయుడు సందర్శించారు. సోమవారం ఉదయం పాఠశాలకు చేరుకున్న ఆయన వర్క్ బుక్కులను పరిశీలిస్తూ విద్యార్థులకు పలు సూచనలను తెలియజేశారు. వీటితో పాటుగా హోంవర్క్ కూడా ఆయన పరిశీలించారు. అభ్యాసన విధానాలను మరింత మెరుగుపరిచే దిశగా కృషి చేయాలని స్థానిక ఉపాధ్యాయులను ఆయన సూచించారు.