'ఉపాధ్యాయ సంఘాలతో మంత్రి చర్చించాలి'
AKP: విద్యారంగంలో సమస్యలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి K.S.S. ప్రసాద్ సూచించారు. అనకాపల్లి CITU కార్యాలయంలో గురువారం జరిగిన కార్యవర్గం సమావేశంలో మాట్లాడుతూ.. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు టెట్ పాసవాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలన్నారు.