11,015 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

11,015 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

కృష్ణా: పెడనలో ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణ కార్యక్రమం సత్ఫలితాలను అందిస్తుందని AO జెన్నీ తెలిపారు. ఈ సీజన్‌కు 64వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 11,015 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. 18 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1,790 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని ఆమె తెలిపారు.